సిద్ధార్థ తిమ్మిరెడ్డి

కళ, ఆత్మ, శాంతి, ప్రేమ, ప్రకృతి, భూమి, నక్షత్రాలు, అంతరిక్షం, విశ్వం. -సిద్ధార్థ తిమ్మిరెడ్డి
Art, spirit, nature, peace, love, earth, stars, universe. -Siddhartha Thimmireddy

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-12

తెలుగు వారికి, తెలుగు జాతికి, తెలుగు వారి దేశానికి, ఆంధ్రులకు, ఆంధ్ర జాతికి, ఆంధ్రుల దేశానికి తమ సొంత అంతిరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసుకోవాలి.. తెలుగు వారి, ఆంధ్రుల అవగాహనతో, శాస్త్రీయ ఆలోచనతో, కళ్ళతో, తెలుగు వారి, ఆంధ్రుల విజ్ఞానంతో మన సొంత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. అంతా తెలుగులోనే ఉండాలి.. మన అంతరిక్షం, మన విశ్వం..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-12

౨. హైదరాబాదును నిర్మించినా, వారి ఆలోచనలో అభివృద్ధి చేసినా, అది ఒక తెలుగు వాళ్ళను, తెలుగు రాజ్యాన్ని తొక్కే, అవమానించే హిందీ, ఆంగ్లేయుల, వ్యాపారస్తుల ప్లాస్టిక్, మేకప్ రాజ్యం మాత్రమే అయ్యింది.. ఈ భూమి విపరీతంగా కలుషితమైపోయింది.. ఒక ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతిని అనుసరించి నడిచే మనుషులు కావాలి, వారి దేశం, లోకం కావాలి.. ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతిని అనుసరించి నడిచే తెలుగు వారి దేశం కావాలి..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-12

౧. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రని అమెరికా చేయాలనే ఉన్నారు కాని, ఆంధ్ర ఆంధ్రగానే గొప్ప దేశం ఎలా అవ్వగలుగుతుందో మాత్రం ఇంకా అర్థం కాలేదనుకుంటా.. ఆంధ్రని బయట దేశ, బయట రాజ్య వ్యాపారాలకు, పరిశ్రమలకు తెరిచి, భూమి ఇచ్చి, ఇంకా బయట దేశస్తుల, బయటి వారి రాజ్యాలకు, వ్యాపారాలకు శ్రీకారం చుడుతున్నారే తప్ప, తెలుగు వాళ్ళను లేపి, తెలుగు వారి అవగాహనతో, తెలుగు వారి జ్ఞానంతో, తెలుగు వారి దేశం మాత్రం పెంపొందించగలిగే కార్యాచరణ, ఆలోచన అర్థం కాలేదు, మరి ఇష్టం లేదేమో, ఇంకా అవగాహన లోకి రాలేదేమో..

అప్పుడు బీజేపీ వాళ్ళు "ఎఫ్ డీ ఐ" అని "భారతదేశా"న్ని బయట వ్యాపారాలకు, పరిశ్రమలకు తెరిచారు, ఇప్పుడు ఈయన ఇంకా అదే అలోచనను కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నారు.

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-11

ఈ రోజు ఇవి తిన్నా:
పొద్దున, మధ్యాహ్నం, చుక్కాకు ఆకులు, కొన్ని కొబ్బరికాయ ముక్కలు, మూడు చిన్న క్యారెట్లు, ఒక అరటిపండు, రెండు దొండకాయలు, మూడు క్యాబేజీ ఆకులు, ఒక పిడికెడు అంత ఎండిన మొలకలు, గోధుమలు, సద్దలు, ముడి బియ్యం, కొర్రలు, కుంకుమపెసలు.. సాయంత్రం, రాత్రి, చింతచిగురు ఆకులు, కొన్ని కొబ్బరికాయ ముక్కలు, కొన్ని చుక్కాకు ఆకులు, ఒక దొండకాయ, ఒక చిన్న క్యారెట్, తోలుతో సహా ఒక బెంగుళూరు మామిడికాయ, ఇంకా ఒక పెద్ద అరటిపండు..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-11

ప్రతీకారం, శిక్ష వేరు, న్యాయం వేరు. న్యాయం అంటే సమాజములో మార్పు, శాంతి..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-11

కొందరి సింధూరం పోయిందని ఇంకా చాలా మంది సింధూరాలు పోతా ఉండాలనా.. నిర్లక్ష్య యుద్ధాలు, తక్షణ ప్రతీకారాలు తప్ప, ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని శాంతియుతం చేయడానికి, విభిన్న ఆలోచనల మధ్య సుదీర్ఘ శాంతిని సాధించేందుకు ఒక కార్యాచరణ అంటూ ఏమీ లేదు, కృషి లేదు, ప్రయత్నం లేదు.. ఆ నిర్లక్ష్య దూరదర్శిని వాళ్ళు ఎప్పుడూ ఎరుపు రంగు పెట్టి, ప్రతీకారం కావాలంటూ, యుద్ధాన్ని, కొట్లాటలను పెంచుదామని చూస్తానే ఉంటారు కానీ, శాంతి సాధించడానికి కార్యాచరణ గురించి మాత్రం కృషి, ప్రయత్నం ఎక్కడేకాని లేదు..

అదే కాదు.. పోయిన ఆడవాళ్ళ సింధూరాల గురించి మాట్లాడుతున్నారు కాని, పోయిన మగవారి ప్రాణాల గురించి మాత్రం ఏమీ లేదు.. ఈ సొళ్ళు నాటకాలు, నిర్లక్ష్య నాయకత్వాలు..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-10

లోతుల సూర్యాస్తమయం - ౨
మాధ్యమం: రంగుల సీసలేఖినులతో కాగితం మీద.
౭.౭౯ వెడల్పు, ౫.౮౨ పొడవు (అంగుళాలు)
౧౯.౮ వెడల్పు, ౧౪.౮ పొడవు (సెంటీమీటర్లు)
౧౯000 రూపాయలు.

ఈ చిత్రలేఖనం చిత్రంలో కనిపిస్తున్నదానికంటే కొంచం లేత రంగులతో, తక్కువ నలుపులతో కూడి ఉంది.

ఈ చిత్రలేఖనం కావాలంటే మీ వివరాలతో పాటు నాకు సందేశం పంపివ్వగలరు. ఏమైనా సందేహాలు ఉంటే సందేశంలో పంపివ్వగలరు. నగదు నా బ్యాంకుకు పంపిన తరువాత, అందిన తరువాత చిత్రలేఖనాన్ని తపాలా ద్వారా పంపిస్తాను.
siddharthathimmireddy@proton.me
+౯౧ ౯౫౭ ౩౫౧ ౨౬౮౫

గమనిక: ఇవి కేవలం అందమైన కళలు. పన్ను వసూలుదారులు, ప్రభుత్వాలు దూరంగా ఉండుము. ఒక మనిషి కష్టాన్ని, కృషిని వారి అనుమతి లేకుండా లాక్కోవడం దౌర్జన్యం.

💰 -> 🖌️🎨🖼️

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-06

నేను అంతర్జాతీయ వలస గురించి మాట్లాడడం లేదు.. ముఖ్యంగా "పాన్ కార్డు" గురించి మాట్లాడుతున్నాను..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-06

మనిషి బతకడానికి "పాన్ కార్డు"లు, "ఆధార్ కార్డు"లు ఇంకా ఎన్నో పత్రాలు పెట్టుకుని తిరుగుతూ ఉండాలంట.. జీవించడానికి ఇవన్నీ ప్రకృతి, దైవం విధించిన నిబంధనలు ఏమీ కాదు.. చెడు ఉద్దేశంతో, సొంత లాభం కోసం ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తుంటే తప్ప, ఎవరికీ తమ పని గురించి జవాబు ఇచ్చుకుంటా, ప్రభుత్వాలను, దేశాలను ప్రకృతిపై, దైవంపై, జీవంపై అధికారం ఇస్తా, వాళ్ళకు పన్నులు కట్టుకుంటా ఉండవలసిన అవసరం లేదు.. ప్రభుత్వాలు, దేశాలు మనుషులకు ఎన్నో అనవసరమైన కాగితాలు అంటగట్టి సాధారణ ప్రజలను తమ బానిసలుగా తయారు చేసుకున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా తిప్పించుకుంటున్నారు.. మనిషి గుర్తింపుకు పత్రం ఏదన్నా ఉంటే మంచిదే.. కానీ మనుషులను ఒక పత్రంగా, పత్రాలుగా పరిగణించడం చాలా పెద్ద తప్పు.. పత్రాలు లేకుంటే మనిషి జీవితం కుదరనీయకుండా చేస్తున్న ప్రస్తుత వ్యవస్థ జీవంపై, ప్రకృతిపై, దైవంపై, మనిషిపై చేస్తున్న తప్పు, నేరం..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-04

అమెరికాలో, ఇంకా చాలా గొప్ప గొప్ప దేశాలలో ఒక్క మనిషి పోవడానికి ప్రతి రోజూ ఐదు, ఏడు మంది కూర్చోగలిగే వాహనాన్ని ఒక్కరు వాడుతారు. వాళ్ళ రహదారులు కూడా చాలా విశాలంగా ఉంటాయి.. వాళ్ళ విశాల హృదయాలతో మనకు కూడా ప్రతి ఒక్కరికి ఐదు, ఏడు మంది కూర్చోగలిగే వహనాలను, విశాలమైన రహదారులను, వారి సంస్క్రుతిని ఇస్తారంట.. వారి ఉద్దేశంలో ఇవి గొప్ప రాజ్యాలు.. కాదు.. ఇవన్నీ అదుపులేని వ్యాపారం, డబ్బు, పరిశ్రమ జ్ఞానాన్ని, తెలివిని అనచివేసిన రాజ్యాలు..

అసలు అమెరికా, లేదా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే దేశాన్ని ఒక మార్గదర్శకంగా తీసుకోవడం మంచిది కాదు. ఆ దేశం అంతా అక్కడి ప్రథమ మానవ జాతులను హింసాత్మకంగా, అన్యాయంగా తొలగించేసి, పక్కకు తోసేసి నిర్మించబడిన విలాస రాజ్యం.

వ్రాసిన తేది: ౨౫ ఏప్రిల్ ౨0౧౫.
సవరించిన తేదీ: ౪ మే ౨0౧౫.

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-04

మంచి దూది దారం ఎక్కడా దొరకడం లేదు ఈ మధ్య.. ఎక్కడ చూసినా "పాలియెస్టర్" దారాలే అమ్ముతున్నారు.. "పాలియెస్టర్" అనే పదార్థం, దారం శిలాజ ఇంధనాలతో తయారు చేస్తారు.. ఒకవేళ దూది దారం దొరికినా, ఆ దారం కూడా ప్లాస్టిక్ లో చుట్టిపెట్టి అమ్ముతున్నారు. ఒక విపరీతంగా కలుషితమైన, విషపూరితమైన ఊబిలో, వలయంలో చిక్కుకున్నట్టుంది ఈ లోకం..

మంచి తుంగ చాపలు కూడా దొరకడం లేదు. అన్నీ ప్లాస్టిక్ చాపలే దొరుకుతున్నాయి. తుంగ చాపలు దొరికినా, వాటిని ప్లాస్టిక్ దారాలతో గడ్డి పుల్లలను కుట్టి, ఏదో కృత్రిమ రసాయనాల గుడ్డతో అంచులను కుట్టి అమ్ముతున్నారు.

పెద్ద పరిశ్రమల వలన మన హస్తకళలు, మన వృత్తులు అన్నీ పాడైపోయాయి, మాయమైపోయాయి, కృంగిపోయాయి, మన జీవితాలు, భూమి కలుషితమైపోయాయి. ఈ పాడైపోయిన, విపరీతంగా కలుషితమైపోయిన పర్యావరణం, భూమి, ఈ లోకం చాలా మంది ఉద్దేశంలో ఆధునిక లోకం. ఇదంతా చాలా పెద్ద అనారోగ్యం, అజ్ఞానం.

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-03

సొంత వాహనాలను, ఆ పరిశ్రమలను, ఆ వ్యాపారాలను, ఆ సంస్కృతిని ప్రోత్సహిస్తూ రహదారులను వెడల్పు చేసుకుంటూ పోదామనే ఉద్దేశంతో, ప్రస్తుత ఆలోచనతో, ఒక పోయిన కాల ఆలోచనతో మనుషులు, ప్రభుత్వాలు పని చేస్తూనే ఉన్నారు.. ఇవన్నీ ప్రకృతి వనరులపై చాలా ఎక్కువ ఒత్తిడి పెడుతున్నాయి.. సొంత వాహనాలను, ఈ పెద్ద పరిశ్రమలను, ఈ వ్యాపారాలను, ఈ రహదారి వ్యవస్థలను అసలు ప్రోత్సహించకూడదు.. అది కూడా, అన్నీ "టోల్" రహదారులు అయిపోతున్నాయి.. ఈ ఆలోచనను, ఈ యంత్రాన్ని ఆపివేయాలి.. ప్రభుత్వాలు కేవలం మంచి ప్రజా రవాణా వ్యవస్థను మాత్రమే ప్రోత్సహించాలి. ప్రజలు నడవడం నేర్చుకోవాలి. వీలైతే సైకిల్ ఉపయోగం ప్రోత్సహించాలి. ఇంత విపరీతంగా పెరిగిపోయిన జనాభాకు, ప్రతి ఒక్కరికి ఒక సొంత వాహనం, విలాసాలు, సౌకర్యాలు కల్పించాలంటే, మన భూమి సరిపోదు, అడవులు, జంతు, జీవ జాతులు ఏమీ మిగలవు..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-05-01

ఉద్యాననాలు అని, ఎన్నో బయటి ప్రాంత, దూర ప్రాంత, ఎక్కవ నీళ్ళు అవసరమయ్యే మొక్కలను, చెట్లను తెచ్చి పెంచడం ఒక ఆనవాయితీ అయిపోయింది.. ఈ కార్యాచరణలు అన్నీ ఏ ప్రాంతంలో ఉన్నామో, ఆ ప్రాంత చెట్లకు, మొక్కలకు, ఆ ప్రాంతంలో, ఆ అడవిలో తిరిగే జంతు, జీవి జాతులకు, నీటి వనరులకు చాలా పెద్ద ముప్పు.. ఏ ప్రాంతంలో ఉన్నామో, ఆ ప్రాంత అడవిని తొలగించేసి, ఆ అడవిలో నివసించే జంతువులు, జీవుల ఇంటిని తొలగించేసి, నాశనం చేసేసి, ఏవో ఎక్కువ నీళ్ళు తాగే, కేవలం అలంకరణ ధ్యేయంగా ఇలాంటి ఉద్యానవనాలను, ఈ నాగరికత అధినేతలు, నిర్మాతలు సృష్టిస్తున్నారు.. ఈ లోకం అంతా ఒక ఓటమి, అజ్ఞానం, ఇంకా ఒక పెద్ద అసమర్థత నేతృత్వం, నాయకత్వం.. ఎంత స్థలం వీలైతే అంత స్థలం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఆ ప్రాంత అడవి జాతి మొక్కలకు, చెట్లకు పెరగనివ్వడానికి, అందులో విహరించే, జంతు, జీవ జాతులకు వదిలేయాలి.. అడవిని ఉండనివ్వండి..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-04-29

అసలు మట్టి అనేది కనిపియ్యకుండా, ప్రకృతి, అడవి వేసే వృక్షాల, మొక్కల గింజలు పడనియ్యకుండా, మొలవనివ్వకుండా కంకరతో భూమిని కప్పేసి నగర నిర్మాణాలు జరుగుతున్నాయి.. ప్రకృతి ఒడిదుడుకులుతోనే ఉంటుంది.. అంతా నున్నగా ఉండాలి, మనిషి అనే జీవి తప్ప ఇంకో జీవి ఏదీ ఉండకూడదన్న ఉద్దేశం మంచిది కాదు.. మట్టి కనిపించాలి.. వృక్షాలు, మొక్కలు కనిపించాలి.. అందులో విహరించే జీవులు కనిపించాలి. కంకరతో నీళ్ళు భూమిలోకి ఇంకనివ్వకుండా, జీవం మొలకెత్తే మట్టి కనిపియ్యకుండా కప్పేసి, కేవలం మనిషి కోసం, మనిషి భయం కోసం భూమిని కప్పివేస్తున్న, నిర్మించబడుతున్న ఈ లోకం మంచిది కాదు.. ఈ మహా నున్నమైన నగర నిర్మాణాలు మంచిది కాదు.. మట్టి మంచిది.. కంకర మంచిది కాదు.. ఎన్నో మనుషులకు హాని కలిగించగలిగే జీవులు ఈ మహా అరణ్యాలలో ఉంటాయి.. కానీ అవన్నీ ఈ భూమి అందం, కళ..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-04-27

నున్నగా చేసిన కొబ్బరికాయ చిప్పలో కొంచం బెల్లం ముక్కలు వేసి, గోధుమ పిండి వేసి, బాగా నీళ్ళు పోసి, ఇంకో చిన్న కొబ్బరికాయ చిప్పతో చేసిన చిన్న చెంచా, లేదా గరిటెతో బాగా చిక్కనైన పిండి నీళ్ళగా కలిపి, బెల్లం కరగడానికి కొంచం సేపు పెట్టాను. బెల్లం కరిగిన తరువాత తిన్నాను.. ఆ రుచి స్వల్పంగా, తేలికగా, తియ్యగా, చిక్కగా, దట్టంగా, చల్లగా చాలా బాగా ఉన్నింది. మంచి తియ్యనైన, చిక్కనైన, దట్టమైన, చల్లనైన, సులభమైన ఆహారం..

గోధుమ పిండి, బెల్లం రెండూ కొంత కాలం క్రితం ప్లాస్టిక్ ముక్తి, సేంద్రీయ ఉత్పత్తి అంగడిలో తీసుకున్నా. డబ్బా తీసుకెళ్ళడం మరచిపోయా, అందుకు కాగితం సంచిలో గోధుమ పిండి వేసిచ్చారు. బెల్లం వాళ్ళు కాగితంలో చుట్టి పెడతారు.

ప్లాస్టిక్ వాడకండి. మందులు, రసాయనాలు కొట్టని, కృత్రిమంగా సవరించని నాటు విత్తనాల సేంద్రీయ వ్యవసాయాన్ని, ఆహార పధార్థాలను, అహార అలవాటును ప్రోత్సహించండి.

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-04-26

ఈ రోజు పొద్దున, మధ్యాహ్నం ఆహారం:
రెండు అంజూరాలు, రెండు, మూడు పిడికెడులంత మొలకెత్తిన, ఎండిన గోధుమలు, సద్దలు, ముడి బియ్యం, కుంకుమ పెసలు, కొద్ది రోజుల క్రితం కొట్టిన కొబ్బరికాయ నుండి మూడు పిడికెడులంత ఎండిన కొబ్బరికాయ ముక్కలు, ఒక మధ్యరకం కీరకాయ, రెండు దొండకాయలు (ఒకటి మాగింది, ఇంకొకటి స్వల్పంగా మాగింది), ఒక పిడికెడు అంత గోంగూర ఆకులు, తెల్ల గలిజేర ఆకులు, రెండు, మూడు పిడికెడులంత వేరుశనగ గింజలు, రెండు పిడికెడులంత నువ్వులు.. పచ్చి ఆహారం ఎంతో బాగుంటుంది..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-04-23

మనం తెలుగు రాష్ట్రం, లేదా దేశం, లేదా, ఆంధ్ర రాష్ట్రం, లేదా దేశం కోసం ఖనిజాలతో, విలువైన ఖనిజాలతో బరువును, ఖనిజ విలువను బట్టి బిల్లలు, లేదా, నాణాలు ముద్రించుకోవచ్చు, మన దేశంలో మాత్రమే ఎక్కువ ఉపయోగపడేలా, బయటకు ఎక్కువ పోకుండా నియంత్రించుకోవచ్చు.. సంయుక్త దక్షిణ రాష్ట్రాలు ఏర్పరచుకొని ప్రతి రాష్ట్రం, తమ సొంత నాణాలను ముద్రించుకోవచ్చు.. కావాలంటే ఇప్పటి "రిజర్వు బ్యాంకు"నే, తెలుగు, లేదా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారికి పని చేసేలా పునర్వ్యవస్థీకరణ చేసుకోవచ్చు.

కానీ "ద్రవిడ" భాషలు, జాతులు కేవలం దక్షిణంలో మాత్రమే లేవు, హిమాలయ దిగువ ఖండం అంతటా వ్యాపించి ఉన్నాయి.. కేవలం నాలుగు "ద్రవిడ" భాషలు అనేది నిజం కాదు..

కానీ తెలుగులో మన సొంత నాణాలను ఊహించుకోండి.. మనకంటూ ఒక దేశం వస్తుంది.. సొంత రక్షణ అనే బాధ్యత తెలుస్తుంది.. ఇప్పుడు కాపలాదారుడిని హిందీ వాడిని చేసి, అంతా తెరుచుకొని నిద్రపోతున్నారు..

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-04-23

ఈ రోజు పొద్దున, మధ్యాహ్న స్వల్పాహారం:

ఒక బీటుదుంప, రెండు పిడికెడులంత నానబెట్టిన, మొలకెత్తిన గోధుమలు, సద్దలు, నవారా బియ్యం, ఉద్ధి బేడలు, రెండు అంజూరాలు, ఒక చిన్న అరటిపండు ఇంకా ఒక పిడికెడు కంటే ఎక్కువ కడిగిన గోంగూర ఆకులు, తెల్ల గలిజేర ఆకులు.

పచ్చి ఆహార అలవాటు ఉత్తమం, సులభం, మరియు అనవసరమైన పనిని తగ్గిస్తుంది, అగ్ని కోసం అనవసరంగా చెట్లను కొట్టవలసిన అవసరం లేకుండా, లేదా ఈ కాలంనాటి పరికరాల, ఆ వ్యవస్థల నుండి, ఆ పరికరాల, వ్యవస్థల భారం నుండి విముక్తిని, స్వేచ్ఛను ఇస్తుంది, మనల్ని ప్రకృతికి దగ్గరకు చేరుస్తుంది. పచ్చి ఆహారం ప్రథమ, లేదా, నిజమైన ఆహారం. ఆది ఆహారం. శాంతమైన జీవితానికి మంచి ఆహారం.

యోగి, ప్రకృతి జీవి, ప్రకృతి యోద్ధ..

చిత్రం లేకుండా ఒక మంచి ఆలోచనను భాష, లిపి ద్వారా వ్యక్తపరిచే యత్నం. మీ ఊహలో రంగులు, చిత్రాన్ని వేసుకోండి.

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-04-19

కోసిన సొరకాయ ముక్కలు, "బీట్రూట్" ముక్కలు, ఒక నల్ల వంకాయ ముక్కలు, ఒక టమోటో ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, నానబెట్టిన, మొలకెత్తడం మొదలైన గోధుమలు, నవారా బియ్యం, సద్దలు, ఉద్ధి బేడలు, గోంగూర ఆకులు, తెల్ల గలిజేర ఆకులు, నువ్వులు ఒక, ఇప్పటి వరకు దొరికిన వాటిల్లో అన్నింటికంటే పెద్దదైన, నున్నగా చేసిన కొబ్బరికాయ చిప్పలో. కొన్ని దొండకాయలు, ఒక నువ్వుల లడ్డు ఒక మధ్యరకం కొబ్బరికాయ చిప్పలో, రెండు చిన్న అరటిపళ్ళు ఇంకా ఒక కీరకాయ. నువ్వుల లడ్డు సాయంత్రం తిందామని తీసేసి డబ్బాలో పెట్టా, అందుకే చివరి చిత్రంలో కనిపియ్యడంలేదు.
ఈ కొబ్బరికాయ చిప్ప ఇప్పటి వరకు దొరికిన వాటిలో అన్నింటికంటే పెద్దది. ఒక కొబ్బరికాయ చిప్ప ముక్కతో చేసిన చిన్న గరిట, లేదా, చెంచాతో తింటున్నా. ఆది గరిట, లేదా, ఆది చెంచా.. ఆది అనగా మొదటి, లేదా ప్రథమం. ఆది మానవుడు అనగా ప్రథమ మానవుడు అని అర్థం.

సిద్ధార్థ తిమ్మిరెడ్డిsiddhartha91
2025-04-19

సొంత సంచిలో నువ్వులు, సొంత డబ్బాలలో బెల్లం సేకరించి పచ్చి నువ్వుల లడ్డు చేసా. విక్రయానికి తీసుకు వెళ్ళా. ప్లాస్టిక్ విముక్తి ఆహారం, ఆహారం తయారీలో కూడా. ౧౨ ఏప్రిల్ ౨0౨౫ నాడు దాదాపు మూడు గంటలు ఉన్నా. ఎంత వరకు అమ్మానో, అమ్మలేదో చెప్పలేను.

మొదట నువ్వులను, బెల్లంను ఒక గిన్నెలో వేసి, దంచే రాయితో దంచడానికి ప్రయత్నించా. సరిగా కుదరలేదు. అందున "మిక్సర్"లో వేసి పిండి లాగా కొట్టా. విద్యుత్ పరికరం వాడాను. తరువాత లడ్డూలు లాగా చేసా. చాలా రుచికరంగా ఉన్నిన్నాయి. నాకు తెలుగు పిండి వంటలు చాలా ఇష్టం.. కానీ, అందరూ ఈ పిండి వంటకాలు తయారీ కోసం ప్లాస్టిక్ విపరీతంగా వాడుతున్నందువలన, పాలు, పాల పదార్థాలు వాడుతున్నందువలన ఆ ఆహారం నేను తినను. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలి. తెలుగు మిఠాయిలు, పిండి వంటకాలు, అన్నీ ప్లాస్టిక్ విముక్తి వంటగదులు, వంటశాలల నుండి రావాలి. ప్లాస్టిక్ నిరోధించడానికి తగిన కసరత్తు చేయాలి.

Client Info

Server: https://mastodon.social
Version: 2025.04
Repository: https://github.com/cyevgeniy/lmst